
కలంపై కూటమి కక్ష
నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్షగట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది.పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మీడియాపై అంక్షలు విఽధించడం తగదని పలువురు ప్రజాస్వామ్యవాదులు, పార్టీల నాయకులు అభిప్రాయపడతున్నారు.
పత్రికలపై కేసులు రాజ్యాంగ విరుద్ధం
రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర మీడియాది. ప్రజాస్వామ్యం ప్రకారం తమ భావజాలాన్ని వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం మనకు కల్పించింది. తప్పుంటే రాజ్యాంగం ప్రకారం తిప్పకొట్టే అవకాశం ఉంది.అందుకు భిన్నంగా పత్రికల గొంతు నొక్కడం ఎరు చేసినా ఖండీనీయం. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు పెట్టడం, వేధించడం సమర్థనీయం కాదు. –మర్రి రవికుమార్,
వైస్‌చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ,
తగిన మూల్యం చెల్లించుకుంటారు
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. నోటీసుల పేరుతో ఇళ్ల వద్దకు, సాక్షి కార్యాలయాల వద్దకు వెళ్లి పోలీసులు హంగామా సృష్టించడం అప్రజాస్వామికం. ప్రజల వాణిని వినిపించే మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
– సయ్యద్ ముస్తాక్ మండల కన్వీనర్, పుల్లంపేట
ఉద్దేశ పూర్వకంగానే సాక్షిపై కుట్ర
ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం సాక్షి పత్రికపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తేవడం నేరం కాదు. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు సాక్షి కార్యాలయానికి వెళ్లడం, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చర్యల పట్ల జర్నలిస్టులు విస్తుపోతున్నారు. – పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు,
ప్రొద్దుటూరు
బెదిరింపులు మానుకోవాలి
రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది. ప్రభు త్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకొస్తూ వార్తలు రాసే పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టి కలానికి సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. సాక్షి మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం కాదు సహేతుకం కాదు. ప్రభుత్వం జర్నలిస్టులను బెదించే ధోరణికి స్వస్తి చెప్పాలి
– త్రినాథ్, రాజంపేట వ్యవసాయ మార్కెట్
కమిటీ మాజీ చైర్మన్, నందలూరు

కలంపై కూటమి కక్ష

కలంపై కూటమి కక్ష

కలంపై కూటమి కక్ష

కలంపై కూటమి కక్ష