
నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు
రాజంపేట: జవహర్ నవోదయ విద్యాలయం(రాజంపేట మండలం నారమరాజుపల్లె)లో 2026–27 సంవత్సరానికి 11 వతరగతిలో ప్రవేశానికి మరోసారి గడువును పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి అన్నమయ్య, కడప జిల్లాకు చెందిన విద్యార్ధులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఏవీవోడీఏవైఏ.జీవోఎన్ వె వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. చివరి తేది 23–10–2025 అని వెల్లడించారు.
● 2026–27 సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి కూడా గడువును పెంచినట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ తెలిపారు. 23.10. 2025 వరకు గడువు ఉందని వెల్లడించారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
గాలివీడు: మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పర్యావరణ మండల ప్రత్యేక అధికారి.. ఉపాధిహామీ పీడీ వెంకటరత్నం అన్నారు.శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛమైన గాలి– ఆరోగ్యకరమైన జీవనం‘అనే అంశంపై జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్, ఎస్ డబ్ల్యూపీసీ సెంటర్లో మొక్కలు నాటే కార్యక్రమం,సైకిల్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పరిరక్షించాలని తెలిపారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివద్ధి అధికారి శకె.చంద్ర మౌలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు