
అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక
నిమ్మనపల్లె: మండలంలోని రెడ్డివారిపల్లె మోడల్‌స్కూల్‌లో శనివారం జిల్లా అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక నిర్వహించినట్లు స్కూల్‌గేమ్స్ కార్యదర్శి డాక్టర్.ఎస్.బాబు, నాగరాజ తెలిపారు. జిల్లాలోని 30 మండలాల నుంచి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపీడీఓ రమేష్‌బాబు, ఎంఈఓ నారాయణ, పద్మావతి ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, క్రీడాభారతి పీడీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్‌బాబు, సెలక్షన్ కమిటీ సభ్యులు శారద, మోహన్, అన్సర్‌బాషా, ఇందిర, మణి తదితరులు పాల్గొన్నారు.
కడప: కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో చిన్న పిల్లల విభాగం (పీడియాట్రిక్స్)లో పీజీ సీట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఎన్‌ఎంసీ ఇటీవల 4 పీజీ సీట్లు మంజూరు చేసింది. గతంలో 3 పీజీ సీట్లు ఉండేవి. సీట్ల పెంపు కోసం హెచ్‌ఓడీతోపాటు వైద్యులు కృషి చేశారని జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ తమ చాంబర్‌లో పీడియాట్రిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ వై. వంశీధర్, వైద్యులు అనిల్ కిరణ్, పద్మినీ ప్రియా, బి.కె.నిరంజన్‌తోపాటు చిన్నపిల్లల విభాగం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక