టపాసుల మోతే! | - | Sakshi
Sakshi News home page

టపాసుల మోతే!

Oct 19 2025 6:53 AM | Updated on Oct 19 2025 6:53 AM

టపాసు

టపాసుల మోతే!

రాయచోటి : దీపావళి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా విక్రయ కేంద్రాలను సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా టపాసుల విక్రయ కేంద్రాల నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశానుసారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్‌ శాఖల సమన్వయంతో జిల్లాలోని శాశ్వత టపాసుల విక్రయ కేంద్రాలతో పాటు పండుగ సందర్భంగా తాత్కాలిక విక్రయ కేంద్రాల అనుమతుల విషయంపై నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో 42 శాశ్వత లైసెన్సుదారులకు గాను ఈ ఏడాది 33 షాపులకు అనుమతులు పొందారు. దీనితో పాటు రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో తాత్కాలిక షాపుల ఏర్పాటు కోసం 252 ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందాయి. ఈ విక్రయకేంద్రాలను నివాస కేంద్రాలకు, పాఠశాలలకు, ఇతర ప్రమాదాలకు దూరంగా విశాలమైన ప్రదేశాలలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు.

వన్‌ మెన్‌ కమిటీ..

బాణసంచా అమ్మకాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. గతంలో రెవెన్యూ అధికారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేవారు. ఈ ఏడాది వన్‌మెన్‌ కమిటీ అంటే రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌, విద్యుత్‌ శాఖల సమన్వయంతో తాత్కాలిక విక్రయ కేంద్రాలకు అనుమతితో ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలన చేసి నివేదిక అందిస్తారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి..

● అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం జనావాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో టపాసుల విక్రయాలు, దుకాణాలు ఉండరాదు. గోదాములు సైతం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు

● నివాస సముదాయాలకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలు ఉండాలి.

● తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు సైతం 3 మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది.

● దుకాణాల దగ్గర సిగరెట్‌, బీడీ తాగరాదు.

● ప్రతి దుకాణం వద్ద ప్రత్యేకంగా నీటిసౌకర్యం, అగ్ని నిరోధక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

● జనావాసాల మధ్య తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసే చోట తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ ఉండి తీరాలి. ప్రమాద బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ధూమపానం నిషేధిత స్థలంగా ప్రకటించాలి.

● అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అంటుకునే తడికలు, ప్లాస్టిక్‌ కవర్లతో దుకాణాలు ఏర్పాటు చేయరాదు. ప్రత్యేకంగా తయారు చేసిన జింక్‌, జీఐ రేకులతో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా షెడ్‌లలో హౌస్‌ కీపింగ్‌, చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి.

● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి అగ్నిమాపక వాహనం వచ్చి చుట్టూ తిరిగే విధంగా స్థలం ఇచ్చి షెడ్‌లను నిర్మాణం చేసుకోవాలి.

● ఒక దుకాణానికి మరో దుకాణానికి కచ్చితంగా 3 మీటర్ల దూరం ఉండాలి. వాటితో పాటు బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా దారులు ఏర్పాటు చేయాలి.

● విద్యుత్‌ వైరింగ్‌ చేసుకునే సమయంలో ఎలాంటి అతుకులు లేని వైర్‌ ఉపయోగించాలి. ఒక్కో సందర్భంలో వీటి నుంచి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వైరింగ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.

● రేకులతో కూడిన్‌ షెడ్‌లు వేస్తేనే అనుమతి ఇస్తారు. ప్రతి దుకాణంలో రెండు మంటలను ఆర్పే పరికరాలు, 200 లీటర్ల రెండు డ్రమ్ములు, 4 నీటి బకెట్‌లు, రెండు ఇసుక బకెట్‌లను అందుబాటులో ఉంచుకోవాలి.

● బాణసంచా దుకాణాల సమీపంలో ఎలాంటి పరిస్థితిలోనూ పొగ తాగరాదని ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలి.

● తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే దుకాణాలకు దూరంగా వాహనాలను పార్కింగ్‌ చేసేలా చూడాలి.

తాత్కాలిక బాణసంచా దుకాణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

అన్నమమయ్య జిల్లాలో ఇప్పటికే

252 లైసెన్సులు జారీ

పాత లైసెన్సులు.. తాత్కాలికం.. 252

రూ. కోట్లలో టపాసుల వ్యాపారం

నిబంధనలు తప్పనిసరి అంటున్న

అధికారులు

టపాసుల మోతే!1
1/2

టపాసుల మోతే!

టపాసుల మోతే!2
2/2

టపాసుల మోతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement