
ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె: చిన్నఓరంపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్‌పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు.
పెన్నానదిలో యువకుడి గల్లంతు
సిద్దవటం : మండలంలోని వంతాటిపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యల నంద (36) అనే యువకుడు శనివారం పెన్నానదిలో గల్లంతయ్యాడు. వంతాటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ పెన్నానది నీటిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బైకులు ఢీకొని గాయాలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొనడంతో యల్లటూరు ప్రదీప్ అనే యువకుడికి గాయాలయ్యాయి. కాలు విరగడంతో ప్రదీప్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు