
లక్ష మద్యం బాటిళ్ల స్కానింగ్
మదనపల్లె రూరల్ : జిల్లాలో ప్రతిరోజు మద్యం దుకాణాల్లో లక్షకు పైగా మద్యం బాటిళ్లను స్కానింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలు, బార్లలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తనిఖీ చేశారు. షాపులో మద్యం బాటిల్‌ను స్వయంగా స్కాన్ చేసి అందులోని వివరాలను వినియోగదారుడికి చూపించి విక్రయించారు. ఈ సందర్భంగా ఈఎస్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఈనెల 16 నుంచి జిల్లాలోని 122 మద్యం దుకాణాలు, 11 బార్లలో మద్యం బాటిళ్లను స్కాన్ చేశాకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారుగా రూ.1.62 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కల్తీ మద్యం విక్రయాలు జరగడం లేదన్నారు. స్కాన్ విధానంపై మద్యం వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మద్యం షాపు పర్మిట్ రూముల్లో కిచెన్లు, రెస్టారెంట్లు నిర్వహించరాదన్నారు. మద్యం దుకాణాలు, బార్లు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగ, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.