
విద్యార్థుల సమస్యలపై బస్సు జాతా
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు జాతాను విజయవంతం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు కోరారు. శనివారం రాయచోటి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ ఈ బస్సు జాతా ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు సాగుతుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.6400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని వెంటనే వాటిని పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రించాలని కోరారు. ప్రభుత్వ ఎస్పీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, ప్రతి మండలానికి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నారాయణ, ధనకుమార్, రఘుపతి, రెడ్డికుమార్, వంశీ, ఆశిక్ తదితరులు పాల్గొన్నారు.