
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
నందలూరు : మండలంలోని మదనమోహనపురం క్రాస్ సమీపంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎస్‌ఐ మాట్లాడుతూ రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, నందలూరు సిబ్బంది, అన్నమయ్య ఆర్‌ఎస్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కలిసి ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మండలంలోని ఎంఎం పురం క్రాస్ రోడ్డు సమీపంలో ఆవుల రవికుమార్, పొత్తపి పెంచలయ్య, బండారు సందీప్, కానపర్తి వంశీకృష్ణ, ఇమిడి నాగరాజు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి బరువు సుమారు 512.9 కేజీలు, వాటి విలువ సుమారు రూ.6.85 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, స్థానిక ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని, అన్నమయ్య జిల్లా ఆర్‌ఎస్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించారు.
20 దుంగలు స్వాధీనం