
అటవీ భూముల ఆక్రమణను అడ్డుకున్న జనం
మదనపల్లె రూరల్ : మండలంలోని చీకలబైలు పంచాయతీ దొనబైలు మార్గంలో అటవీ భూములను ఆక్రమించి దర్గా నిర్మాణానికి యత్నించిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు. మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీ, కర్నాటక ముళబాగిలుకు చెందిన వ్యక్తులు సోమవారం దర్గా నిర్మాణం పేరుతో అటవీ ప్రాంతంలో పనులు ప్రారంభించడంతో స్థానిక గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఫారెస్ట్, పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని ఆక్రమణలు తొలగించి పరిస్థితి చక్కదిద్దారు. వీఆర్వో విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై బయట వ్యక్తులకు సహకరించిన చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు, దేవళం వీధికి చెందిన మహమ్మద్ ఖాదిర్, అతడి భార్య సల్మాతోపాటు మరికొందరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
సుండుపల్లె : మండలంలోని భాగంపల్లి సమీపంలో మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో భార్య, భర్తలు షేక్‌రహజాన్ (60), షేక్ గఫూర్ (65) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో వారినిరాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో మంగళవారం సాయంత్రం బైకు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు..ఎర్రగుంట్లకు చెందిన జేసీబీ ఆపరేటర్ వన్నూరు స్వామి(48) రాజంపేటలో పనులు ముగించుకుని తిరిగి పల్సర్ బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వెనుక వైపు ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపైకి రాగానే రోడ్డు దాటుతున్న ఒంటిమిట్టకు చెందిన మునికృష్ణ(35)ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వన్నూర్‌స్వామికి స్వల్ప గాయాలవగా, మునికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ప్రైవేటు వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
కడపఅర్బన్ : కడప నగరం శంకరాపురంలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. సీఐ వివరాల మేరకు.. శంకరాపురానికి చెందిన విజయకుమార్ సమీపంలో నివాసమున్న అక్కిశెట్టి వెంకట్ మంగళవారం చిన్న విషయమై గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో విజయ్ కుమార్‌ను కులం పేరుతో దూషిస్తూ వెంకట్ దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసి విచారిస్తున్నామని సీఐ తెలిపారు.
గాయపడిన ముని కృష్ణ, వన్నూర్‌స్వామి

అటవీ భూముల ఆక్రమణను అడ్డుకున్న జనం

అటవీ భూముల ఆక్రమణను అడ్డుకున్న జనం