
ఇంటి తాళాలు పగలగొట్టి కబ్జాకు యత్నం
మదనపల్లె రూరల్ : కోర్టు కేసులో ఉన్న ఓ ఇంటి తాళాలు పగలగొట్టి, కబ్జాకు యత్నించిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలో జరిగింది. పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ సుబ్బారెడ్డి లేఅవుట్‌లో ఇంటినెంబర్.17/185ఈ–2–3కు సంబంధించి, మదనపల్లె సెకండ్ ఏడీజే కోర్టులో 2011 నుంచి చలపతి, ప్రతివాదులైన దేవప్రకాష్, రవికుమార్ మధ్య కేసు నడుస్తోంది. ఇదే ఇంటిని తాను కొనుగోలు చేశానని, స్వాధీనం చేయాల్సిందిగా పట్టణానికి చెందిన జరీనా అనే మహిళ చలపతి, దేవప్రకాష్, రవికుమార్, గంగరాజులపై 2024లో మరో కేసు వేసింది. ఇల్లు 17 ఏళ్లుగా దేవప్రకాష్, రవికుమార్ స్వాధీన అనుభవంలో ఉంది. ఇంట్లో 8 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న గంగరాజు, సొంత ఇల్లు నిర్మించుకుని, ఈనెల 2వ తేదీ ఇల్లు ఖాళీ చేసి, తాళాలను యజమాని దేవప్రకాష్‌కు అప్పగించారు. ఇల్లు ఖాళీ అయిన విషయం తెలుసుకున్న జరీనా మనుషులు.. వారికి సంబంధం లేకపోయినా ఇంటిని తమకు అప్పగించాలని, లేకుంటే కూల్చేస్తామని దేవప్రకాష్‌ను బెదిరించారు. తర్వాత రెండురోజుల అనంతరం మరోసారి బుధవారం రాత్రి 8.30 గంటలకు, దౌర్జన్యంగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి కబ్జాకు యత్నించారు. విషయం తెలుసుకున్న బాధితుడు దేవప్రకాష్..112 నెంబర్‌కు ఫోన్‌చేస్తే.. వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టిన యువకులు తయీజ్, రూపేష్, సైఫ్ పేర్లు నమోదు చేసుకుని, తాళాలు వేసి స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. గురు వారం బాఽధితులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశా రు. సీఐ మహమ్మద్ రఫీ ఈ విషయమై మాట్లాడుతూ.. ఆస్తి వివాదం కోర్టులో నడుస్తుండగా తాళా లు పగలగొట్టడం నేరమని, అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో లీగల్ ఒపీనియన్ తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.