
అలుపెరుగని పోరాట యోధుడు కాన్షీరాం
మదనపల్లె రూరల్ : భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన పోరాట యోధుడు కాన్షీరాం అని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం.శివప్రసాద్ అన్నారు. గురువారం కాన్షీరాం 19వ వర్ధంతి సందర్భంగా స్థానిక బాస్, వీసీకే కార్యాలయంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీడిత జనుల విముక్తి కోసం డాక్టర్.బీఆర్.అంబేద్కర్ తుదిశ్వాస వరకు కృషిచేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని అంబేద్కర్ ఆశయాల సాధన కోసం జీవితకాలం పోరాడిన మహనీయుడు కాన్షీరాం అన్నారు. కార్యక్రమంలో వీసీకే, బాస్ నాయకులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, వై.గంగాధర్, సొన్నికంటి రెడ్డెప్ప, క్రాంతి, రవిశంకర్, విద్యార్థి నాయకులు పృథ్వీరాజ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
బహుజన యువసేన ఆధ్వర్యంలో..
బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు పాల్గొన్నారు.