
నిమ్మతోట బాధితులకు అండగా ఉంటాం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొనరాజుపల్లిలో ఈనెల 7వ తేదీ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన అప్పిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అప్పిరెడ్డి సుబ్బారెడ్డి నిమ్మతోటను టీటీడీ మూకలు దున్నేసిన ఘటనపై గురువారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యను విన్న ఎంపీ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అమాయకులైన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను కూటమి నాయకులు లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందని, ఏమి చేసినా మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడనే అహంకారంతో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. అందులో భాగమే అప్పిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నిమ్మతోట దున్నేయడం అన్నారు. ఇలాంటి వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తాం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.