
దోచుకోవడమే లక్ష్యంగా పాలన
● కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్టినేటర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
● రచ్చబండకు కార్యకర్తలు
సిద్ధం కావాలి
● గ్రామస్ధాయి నుంచి
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
రాజంపేట : రాష్ట్రంలో దోచుకోవడమే లక్ష్యంగా కూటమి పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్టినేటర్, శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.గురువారం రాజంపేట మండలం ఆకేపాడు ప్రాంతం పరిధిలో ఉన్న ఆకేపాటి ఎస్టేట్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి వి స్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల ద్వారానే పాలన కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. గ్రామకమిటీ స్ధాయి నుంచి వైఎస్సార్‌సీపీ బలోపేతం దిశగా వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గ్రామ,మండల, జిల్లా స్ధాయి కమిటీల నియామకం పూర్తిచేసి, బలోపేతం దిశగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలల్లో పార్టీ కమిటీలను పూర్తి చేసి, ముందంజలో ఉందన్నారు. ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోందని, అవి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కుటుంబానికి సాయం అందించేందుకు 2లక్షల 59వేల కోట్లు వ్యయం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. కల్తీమద్యం వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు, వైఎస్సార్‌సీపీకి అంటగట్టేందుకు ఎల్లోమీడియా అష్టకష్టాలు పడుతోందని, అయితే కల్తీమద్యం టీడీపిదేనని ప్రజలందరూ బహిరంగంగానే అంటున్నారని అన్నారు. కల్తీమద్యం కేసుకు కీలక సూత్రధారి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి రూ.50కోట్లు, టికెట్‌కు రూ.50కోట్లు ఇచ్చుకొని పోటీ చేశారని, అటువంటి వ్యక్తితో వైఎస్సార్‌సీపీకి మరక అంటించేలా రాసేందుకు ఎల్లోమీడియాకు సిగ్గుండాలని దుయ్యబట్టారు. రాష్ట్రమంతటా మద్యం అక్రమడంప్‌లు బయటపడుతున్నాయన్నారు.. ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి తెలియకుండా అక్రమమద్యం వ్యహారం నడవలేదని ప్రజలు గుర్తించారన్నారు. దిగజారుడు ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నడిపిస్తున్నాడని విమర్శించారు. సమావేశం ప్రారంభంలో ఎమ్మెల్యే ఆకేపాటి మనవడు ఆకేపాటి హేమరాఘవరెడ్డి స్వాగతం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పోలాశ్రీనివాసులరెడ్డి, ఫయాజ్‌బాషా, వనజారెడ్డి, ఎంపీపీలు మేడా భాస్కరరెడ్డి, గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీనేతలు గాలివీటి భాస్కర్‌రెడ్డి,గాలివీటి వీరనాగిరెడ్డి, చొప్పాఎల్లారెడ్డి, టక్కోలు శివారెడ్డి,తల్లెంభరత్‌రెడ్డి,ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, విజయకుమారెడ్డి, ఉదయకుమార్‌రెడ్డి, పాలగిరిసుధాకర్‌రెడ్డి, నడివీధిసుధాకర్, యధుభూషణరెడ్డి, శిబ్యాలవిజయభాస్కర్, భాస్కర్‌రాజు, రామనాథం, దాసరి పెంచలయ్య,పొత్తపి చంద్ర, గాలివీటి ప్రవీణ్‌రెడ్డి, సుగవాసిశ్యామ్, వైఎస్సార్‌సీపీ మహిళ వివిధ స్ధాయి నేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, షమీమ్‌అస్లాం, బీరంగ రేవతి, మహితా, అజంతమ్మ, మల్లీశ్వరి, అజంతమ్మ, ఎంపీపీ రమణమ్మయాదవ్,మిరియాలసురేఖ,మైనార్టీ నేతలు హరున్‌బాషా, రియాజ్ అహమ్మద్, ముస్తాక్, కలీం, డీసీఎంఎస్ మాజీ చై ర్మ న్ దండుగోపి, రాజంపేట, ఒంటిమిట్ట, సుండుప ల్లె, వీరబల్లి, సిద్ధవటం మండలాలకు చెందిన వివిధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగనన్న విజన్...
జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జగనన్న విజన్‌ను వీడియో వైవా ద్వారా నిర్వహక ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి నిర్వహించారు. పార్టీ కమిటీ నిర్మాణంతోపాటు బలోపేత దిశగా చేపట్టాల్సిన నియమ నిబంధనలు పార్టీ క్యాడర్‌కు వివరించారు.
సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు, మాట్లాడుతున్నపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.చిత్రంలో ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్‌బాబు తదితరులు
16 నెలలో అవినీతి, అక్రమాలు, అక్రమకేసుల తప్ప మరొకటి లేదు. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పరిపాలన సాగుతోంది.ఇప్పుడు పతనం అంచులో టీడీపీ ప్రభు త్వం కొనసాగుతోంది. కల్తీమద్యంతో ప్ర జల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా రు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ,మహిళపై అఘాయిత్యాలు లాంటి సంఘటనలతో సీఎం సిగ్గుతో తలదించుకోవాలి.
– చింతలరామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీలేరు
వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అక్టోబరులో అమెరికాకు ఐకాస సమావేశానికి వెళ్లే బృందంలో ఎంపీ మిధున్‌రెడ్డిని ప్రధాని మోదీ ఎంపిక చేయడం గర్వకారణం. మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటికివచ్చారు. అందరి భాగస్వామంతో పార్టీ పటిష్టతకు కృషిచేయాలి.
– కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి వైఫల్యాలపై శంఖానాదం పూరించాలి. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.క్షేత్రస్ధాయిలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడగులు వేయాల్సి ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో 14వేలమందితో పార్టీ కమిటీల నియామకం పూర్తిచేయడం అభినందనీయం.
– గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
కూటమి పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. తప్పుడుకేసులు, తప్పుడు నిర్ణయాలతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు.ఇప్పుడు రాష్ట్రంలో సుపరిపాలనకాదు, అక్రమమద్యం మత్తులో పాలన కొనసాగుతోంది.కార్యకర్తలు సైన్యంలా పార్టీ బలోపేతానికి కృషిచేయాలి
– సురేష్‌బాబు, జిల్లా పరిశీలకులు, వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీ పటిష్టంగా ఉంది. గ్రామస్ధాయి నుంచి రూ.18లక్షల సైన్యం రెడీ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. కూటమి ప్రభుత్వ బెదింపులకు భయపడే వారు వైఎస్సార్‌సీపీలో లేరని తెలసుకోవాలి.
– రెడ్డప్పగారి రమేష్‌రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి,
అవినీతి, అక్రమాలు టీడీపీ ప్రభుత్వం నిలయంగా మారింది. కల్తీ మద్యం రాష్ట్రమంతటా కంపు కొడుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలైంది.అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నడుం బిగించక తప్పదు.
– సుగవాసి బాలసుబ్రమణ్యం, వైఎస్సార్‌సీపీ కేంద్రకమిటీ సభ్యుడు

దోచుకోవడమే లక్ష్యంగా పాలన

దోచుకోవడమే లక్ష్యంగా పాలన

దోచుకోవడమే లక్ష్యంగా పాలన

దోచుకోవడమే లక్ష్యంగా పాలన

దోచుకోవడమే లక్ష్యంగా పాలన

దోచుకోవడమే లక్ష్యంగా పాలన

దోచుకోవడమే లక్ష్యంగా పాలన