
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్ : అర్హులైన నిరుద్యోగ మైనార్టీ యువతకు హోం కేర్ నర్స్ ఉద్యోగాల కోసం ఓవర్సీస్ మెన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఖతర్ దోహాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ విషయాన్ని అన్నమయ్య, వైఎస్‌ఆర్ కడప జిల్లా ఏపీ స్టేట్ మైనార్టీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు షేక్ హిదాయతుల్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ (నర్సింగ్), జీఎన్‌ఎం (నర్సింగ్) అర్హత కలిగి 21–40 సంవత్సరాలు కలిగిన సీ్త్ర, పురుష అభ్యర్థులు 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 12వ తేదీన విజయవాడలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 08562–241137, 9290448452, 9515835805 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఆలయ భూముల
ఆక్రమణలపై చర్యలు
సుండుపల్లె : మండల పరిధిలో ఆలయ భూములు ఆక్రమణకు గురైతే స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపడుతున్నట్లు దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథం తెలిపారు. సుండుపల్లెకు సమీపంలో రెవెన్యూ ఆర్‌ఎస్‌ఆర్, దేవదాయ శాఖ రికార్డుల ప్రకారం 2127 సర్వే నంబర్‌లో సుండుపల్లెమ్మ దేవతకు చెందిన ఆక్రమణలకు గురైన 4.40 ఎకరాల మాన్యం భూములను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 59 మందికి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని దేవదాయ శాఖ జిల్లా అధికారి విశ్వనాథం తెలిపారు. గురువారం మండలంలోని పలు ఆలయాలను పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న పూజలు, దూప దీప నైవేద్యాల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు.
రాయచోటి : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్‌లు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడంచెల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. డీఆర్‌ఓ మధుసూదన్ రావు పాల్గొన్నారు.