
పార్టీ పటిష్టతకు కృషిచేయాలి
వైఎస్సార్‌సీపీని పటి ష్టం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. వైఎస్ జగన్ ఆదేశం మేరకు డిసెంబరులో పు పార్టీకి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలి. 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలే ప్రధానభూమిక పోషించాలి.
– మేడా రఘునాథరెడ్డి, ఎంపీ, రాజ్యసభ
జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అన్ని స్ధాయి కమిటీలను పూర్తి చేశాం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించాం. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా పార్టీని సంసిద్ధం చేస్తున్నాము. 2029లో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశగా ఇప్పటి నుంచి పార్టీ క్యాడర్ సమాయత్తంకావాలి
– ఆకేపాటి అమరనాధ్‌రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే
సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్‌లో దిట్ట.ఇందులో సందేహం లేదు. సరైన సమయంలో ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు కాదు, మద్యం పరిశ్రమలు వెలుస్తున్నాయి.రాష్ట్రమంతటా నకిలీమద్యం సరఫరా అవుతోంది. నకిలీ మద్యం స్కాంపై విచారణ జరపాలి. సంపద సృష్టిస్తామని చెపుతూ తమ సంపదను పెంచుకుంటున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ సైన్యం సిద్ధం కావాలి.
– నిసార్ అహమ్మద్, ఇన్‌చార్జి, మదనపల్లె

పార్టీ పటిష్టతకు కృషిచేయాలి

పార్టీ పటిష్టతకు కృషిచేయాలి