సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె | - | Sakshi
Sakshi News home page

సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె

Oct 10 2025 7:52 AM | Updated on Oct 10 2025 7:52 AM

సాగుక

సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె

సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె

ఉలవపంట సాగు విస్తీర్ణం వివరాలు

గుర్రంకొండ : జిల్లాలో ఉలవ పంట సాగుకు అదను దాటుతుండడంతో రైతులు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సీడీ ఉలవల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలు ఉలవ పంట సాగుకు అనుకూలం. గత ఏడాది ప్రభుత్వం సబ్సిడీ ఉలవలను సెప్టెంబర్‌నెలలోనే పంపిణీ చేసింది. ఈ సంవత్సరం ఇంతవరకు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వర్షాధారమైన ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.ముఖ్యంగా ఉలవపంట సాగుకు ఇదేఅదను కావడంతో ప్రభుత్వం పంపిణీ చేసే ఉలవల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 17256 ఎకరాల విస్తీర్ణంలో ఉలవ పంట సాగుకు రైతులు సన్నాహాలు చేసుకొంటున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌సీజన్‌ వేరుశగపంట సాగు గడవు ముగిసింది. సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురిసే జూన్‌, జులై, ఆగష్టు నెలల్లో మాత్రమే వేరుశనగ సాగుకు అనుకూలం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో వేరుశనగ సాగు అనుకున్న విధంగా సాగలేదు. జిల్లాలో సగటున నుంచి 24 శాతం మంది రైతులు మాత్రమే ఈసీజన్‌లో వేరుశగ సాగు చేశారు. గడువు ముగిసి పోవడంతో మిగిలిన రైతులు ప్రత్యామ్నాయ పంటలు, అందులోనూ ఉలవపంట సాగుకు సన్నద్ధమవుతున్నారు.

ఉలవ పంట సెప్టెంబరు నుంచి అక్టోబర్‌ 30 వరకు సాగు చేసుకోవడానికి ఆనుకూలంగా ఉంటుంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వేరుశన పోను మిగిలిన 17256 ఎకరాల్లో రైతులు ఉలవ సాగు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే ఉలవ పంట సాగు చేసుకోవచ్చని రైతులు అంటున్నారు.

అన్నదాతకు అవసరమైన ఉలవల స్టాకు కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి స్టాకు రాగానే పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లోనే పంపిణీ

సాధారణంగా జిల్లాలోని రైతులు వేరుశనగ పంట సీజన్‌ ముగియగానే ఉలవ సాగు చేయడానికి ఏర్పాట్లు చేసుకొంటారు. సాగును సెప్టెంబర్‌నెలలోనే ప్రారంభించడం ఆనవాయితీ. గత ఏడాది రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్‌ మొదటి వారంలోనే జిల్లాలోని రైతుసేవాకేంద్రాల ద్వారా సబ్సీడీపై ఉలవలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు. రైతులు ప్రతిరోజు గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో వ్యవసాయ సిబ్బంది వద్దకు వెళ్లి వాకబు చేస్తున్నారు. అయితే సబ్సిడీ ఉలవల పంపిణీపై వారికే సరైన అవగాహన లేకపోవడం రైతులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.

ఉలవల కోసం రైతుల ఎదురుచూపులు

ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధం !

జిల్లాలో17256 ఎకరాల్లో ఉలవ సాగు

నియోజకవర్గం సాగు విస్తీర్ణం

పేరు (ఎకరాల్లో)

1) పీలేరు 4520

2)తంబళ్లపల్లె 4635

3) మదనపల్లె 3850

4) రాయచోటి 4251

సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె 1
1/1

సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement