
విద్యార్థిపై దాడి సంఘటనపై విచారణ
లక్కిరెడ్డిపల్లి : ఫీజు చెల్లించలేదని బి.కొత్తకోట రిషీవాటిక గురుకులం విద్యార్థి శేషాద్రిరెడ్డిపై రాయితీ దాడి చేసిన సంఘటనపై ఉన్నతాధికారులు బుధవారం విచారణ నిర్వహించారు. సాక్షిలో ప్రచురితమైన విద్యార్థిపై దాడి....ఘటనపై వారు స్పందించారు. అన్నమయ్య జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ లక్ష్మీ నరసయ్య చేరుకుని విద్యార్థికి వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో శేషాద్రిరెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడిపై బోధనేతర సిబ్బంది వెంకటేష్ దాడి చేసి నెల రోజులవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని, పోలీసులు పాఠశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అన్యాయంపై ప్రశ్నిస్తుంటే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. శేషాద్రి రెడ్డి కేసును జిల్లా యంత్రాంగం నీరుగారుస్తోందని కన్నీటి పర్మంతమయ్యారు. వెంకటేష్‌ను అరెస్టు చేసే వరకూ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మదనపల్లి పోలీసులు తమను కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారన్నారు.