
ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి: పీజీఆర్‌ఎస్ ద్వారా అందే ప్రతి అర్జీని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తోందని తెలిపారు. కావున అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
● వ్యవసాయ అనుబంధ రంగాల పనిముట్లపై జీఎస్టీ తగ్గింపును రైతులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలోని మార్కెట్ యార్డులో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, బయో పెస్టిసైడ్స్ తదితర వస్తువులపై జీఎస్టీ 2.0 అమలు అనంతరం రైతులకు చేకూరే లబ్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పాత రేట్లు, కొత్తరేట్లు తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాయచోటి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ ఎ రాంప్రసాద్ రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివ నారాయణ, జిల్లా ఉద్యానవన అధికారిణి సుభాషిణి, పశు సంవర్ధకశాఖ డీడీ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.