
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
● కుంటలో పడి ఇద్దరు చిన్నారుల
మృత్యువాత
● శోకసంద్రంలో తల్లిదండ్రులు
సంబేపల్లె : ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ.. అనంతలోకాలకు వెళ్లారు. నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు. వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన సంబేపల్లె మండల పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామం నడిమిరాజుగారిపల్లె దళితవాడ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడిమిరాజుగారిపల్లెకు చెందిన ములగురి జనార్ధన్‌నాయుడు, సుజన దంపతులకు లిఖిత్ (11) అనే కుమారుడు ఉన్నాడు. వారి ఇంటికి మదనపల్లె అమ్మమిట్ట చెరువుకు చెందిన రఘుపతినాయుడు, సుమలతతోపాటు వారి కుమారుడు పి.మోక్షిత్(13) దసరా సెలవుల సందర్భంగా వచ్చారు. సుమలత, సుజన అక్కాచెల్లెళ్లు. వారి కుమారులైన లిఖిత్, మోక్షిత్ సెలవుల్లో సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఆడుకుంటూ సమీపంలోని నల్లరాళ్లకుంట వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఆడుకుంటూ.. అనంతలోకాలకు..

ఆడుకుంటూ.. అనంతలోకాలకు..