
5జీ మొబైల్స్ ఇచ్చే వరకు విధుల బహిష్కరణ
ఒంటిమిట్ట (సిద్దవటం) : 5జీ మొబైల్స్ ఇచ్చే వరకు ఆన్‌లైన్ పనులు బహిష్కరిస్తున్నామని ఒంటిమిట్ట వెలుగు వీఓఏలు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సీ్త్రశక్తి భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట వీఓఏలు ఏపీఎం అశోక్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5జీ మొబైల్స్ ఇవ్వకుండా కింది స్థాయిలో ఆన్‌లైన్ పనులు చేయలేదని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి పనికి లక్ష్యాన్ని పెట్టి ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో పెద్ద చౌరెడ్డి (55) అనే వ్యక్తి మృతి చెందాడు. పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండల పరిధిలోని అంజనపురం గ్రామానికి చెందిన పెద్ద చౌరెడ్డి సొంత పనుల నిమిత్తం శుక్రవారం రాత్రి పట్టణానికి వస్తుండగా మార్గమధ్యంలోని పెన్నానది బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం
చాపాడు : మండల పరిధిలోని విశ్వనాథపురం గ్రామ సమీపంలో ఏటూరు కాలువ వద్ద శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు... 50 ఏళ్లు పైబడిన గుర్తు తెలియని మగ వ్యక్తి శవాన్ని గుర్తించామన్నారు. మృతదేహం బాగా కుళ్లిపోవడంతో ముఖం కూడా కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు కింద పడి గుర్తు తెలియని
యువకుడి దుర్మరణం
ముద్దనూరు : స్థానిక రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం ఉదయం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు(35) దుర్మరణం చెందాడు. ఎర్రగుంట్ల రైల్వే పోలీసు ఎస్‌హెచ్‌ఓ నాగాంజనేయులు సమాచారం మేరకు మృతుని వద్ద జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు బస్సు టికెట్ ఉంది. మృతుని శరీరంపై వున్న టీ–షర్టు ముందు భాగంలో నారాయణ మెడికల్ కాలేజి 2020 అని ముద్రించి ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
మదనపల్లె రూరల్ : ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి ఏఆర్ కానిస్టేబుల్ గాయపడిన ఘటన శనివారం పట్టణంలో జరిగింది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ బోయపల్లెకు చెందిన అమరనాథ్(30), రాయచోటిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గ్రామానికి వెళ్లే క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు వేగంగా వెళ్లాడు. వర్షం కారణంగా బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

5జీ మొబైల్స్ ఇచ్చే వరకు విధుల బహిష్కరణ

5జీ మొబైల్స్ ఇచ్చే వరకు విధుల బహిష్కరణ