పల్లెపల్లెకు ఈ మద్యమే | - | Sakshi
Sakshi News home page

పల్లెపల్లెకు ఈ మద్యమే

Oct 4 2025 1:43 AM | Updated on Oct 4 2025 1:43 AM

పల్లె

పల్లెపల్లెకు ఈ మద్యమే

పల్లెపల్లెకు ఈ మద్యమే ● ఎప్పటినుంచి సాగుతోంది

కిలోమీటరు దూరంలోనే..

మదనపల్లె: మద్యం అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షకట్టి వేధిస్తున్న కూటమి ప్రభుత్వం తన పాలనలో ఏకంగా నకిలీ మద్యం తయారీ కార్మాగారమే వెలసింది. రూ.కోట్లు ఆర్జించాలన్న లక్ష్యంతో అన్నమయ్య జిల్లా మండల కేంద్రం ములకలచెరువుకు కూతవేటు దూరంలో నకిలీమద్యం తయారీ కార్మాగారం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతోంది. స్పిరిట్‌తో తయారు చేసిన ప్రాణాంతక నకిలీమద్యం వ్యవహారంలో అధికార పార్టీనేతల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల తంబళ్లపల్లె నియోజకవర్గానికి పరిశ్రమలు తెస్తామని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు కాని నకిలీమద్యం ఫ్యాక్టరీ వచ్చిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది. స్పిరిట్‌తో తయారైన నకిలీమద్యం తాగితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టే. చవక మద్యం తాగే వారిని లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న నకిలీమద్యం వ్యవహారంపై కూటమిప్రభుత్వం తెరవెనుక ఎవరున్నారో తేల్చుతుందా లేక కాపాడుతుందా అనేది చూడాలని ప్రజలు అంటున్నారు.

దాడితో నకిలీమద్యం మాయం

ములకలచెరువులో నకిలీమద్యం తయారీ కార్మాగారంపై ఎకై ్సజ్‌ అధికారులు దాడులు చేశారన్న సమాచారంతో అక్కడినుంచి సరఫరా అయిన మద్యం బాటిళ్లను ఎక్కడికక్కడ దాచేశారు. బెల్టుషాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లతోపాటే విక్రయాలను కూడా నిలిపివేశారు. దాడులు తమవరకు జరుగుతాయన్న ఆందోళనతో బెల్టు నిర్వాహకులు నకిలీ మద్యం బ్రాండ్ల బాటిళ్లు దాచేసి మొబైల్‌ఫోన్ల స్విచ్చాఫ్‌ చేసేశారు. కాగా ఈ మద్యం తయారీపై సోషల్‌ మీడియాలో స్థానిక ముఖ్య టీడీపీ నేతలకు ప్రమేయం ఉందంటూ ఆరోపణలతో హోరెత్తిస్తున్నారు.

నిఘాకు చిక్కలేదా

ఏదైనా చిన్న ఘటన జరిగినా ఆమూలాగ్రం శోధనచేసి సమగ్ర వివరాలను సేకరించడంలో పోలీసు నిఘా విభాగం కీలకంగా పని చేస్తుంది. అలాంటి నిఘా విభాగం నకిలీమద్యం తయారీ కార్మాగారమే నడుస్తుంటే తెలియకలేదా అన్నది అశ్చర్యమే. ఏదిఏమైనా నకిలీమద్యం తయారీ కేంద్రం వెలుగులోకి రావడం ములకలచెరువులో కలకలం రేపింది. తాము నిత్యం సంచరించే ప్రాంతంలోనే ఇలాంటి పని జరుగుతోందా అంటూ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బెజవాడకు లింకు

ములకలచెరువు నకిలీమద్యం తయారీ వ్యవహరంలో విజయవాడకు చెందిన వ్యక్తులతో లింకులున్నట్టు అనుమానిస్తున్నారు. వీరికి స్థానిక టీడీపీనేతలతో పరిచయాలు ఉన్నట్టు, వారికి ఇందులో ప్రమేయం ఉందన్న ప్రచారం సాగుతోంది. విజయవాడకు చెందిన జనార్దనరావు ద్వారానే ఇక్కడ పనిచేస్తున్న కూలీలను పంపినట్టు ఎకై ్సజ్‌ అధికారులే ప్రకటించారు. నకిలీమద్యం తయారీకి వినియోగిస్తున్న యంత్రాలు ఎక్కడినుంచి తెప్పించారు, నకిలీ లేబుళ్లు ఎక్కడ ముద్రించారో,ఎవరు ముద్రింపజేశారో తేలాల్సి ఉంది.

దసరా మరుసటిరోజే

నకిలీమద్యంతో వ్యాపారం వర్ధి ల్లాలని ఆశించారేమో..యంత్రాలకు, క్యాన్లకు పూజ నిర్వహించారు. గురువారం విజయదశ మిరోజు ఈ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది. గ్యాస్‌ నింపే యంత్రాలకు పూజలు చేసి వాటికి పూలహారాలు వేయడం దాడుల్లో కనిపించింది. దీని చూసిన అధికారులు ఔరా అంటూ అశ్చర్యపోయారు.

ఎకై ్సజ్‌, పోలీసు సర్కిల్‌ స్టేషన్లకు కిలోమీటర్‌ దూరంలోనే నకిలీమద్యం తయారీ కార్మాగారం నిర్వహిస్తుంటే ఎకై ్సజ్‌, పోలీసులకు ఆ విషయం తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కడప, రాయచోటి నుంచి ఎకై ్సజ్‌ అధికారులు వచ్చి దాడి చేసేదాకా ఇక్కడి వ్యవహారం ఎవరికీ తెలియదంటే ఎవరికై నా అనుమానం కలగకమానదు. పోలీసు పెట్రోలింగ్‌, తనిఖీలు సాధారణంగానే జరుగుతుంటాయి. అక్రమ మద్యం, కర్ణాటక మద్యం, సారా తయారీపై ఎకై ్సజ్‌శాఖ దాడులు నిరంతరం సాగుతుంటాయి. ఎక్కడో అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారీపై దాడులుచేసే ఎకై ్సజ్‌ పోలీసులకు తమ స్టేషన్‌కు కిలో మీటర్‌ దూరంలో నకిలీమద్యం తయారీ కర్మాగారం కొనసాగుతుంటే ఎందుకు తెలియకుండాపోయిందో ఆశాఖ ఉన్నతాధికారులే తేల్చాలి. లేదంటే శాఖపరమైన దర్యాప్తు చేపట్టాలి.

ములకలచెరువులో ఎకై ్సజ్‌, పోలీసు సర్కిల్‌ స్టేషన్లకు కిలోమీటర్‌ దూరంలోనే నకిలీమద్యం కర్మాగారం

పోలీసు నిఘా విభాగం నిర్లక్ష్యం

నకిలీమద్యం తయారీలో టీడీపీ నేతలపైసోషల్‌ మీడియాలో ప్రచారం

ములకలచెరువులో తయారైన నకిలీమద్యం తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో బెల్టుషాపులకు తరలించి విక్రయించినట్టు ఎకై ్సజ్‌ అధికారులే చెబుతున్నారు. బెల్టుషాపులకు ఆయా మద్యం దుకాణాదారులే వారి పరిధిలోని పల్లెలకు సరఫరా చేస్తారు. అధికార పార్టీనేతల అండతో ఉమ్మడి చిత్తూరు, అనంతపురంజిల్లాలకు సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. ఎకై ్సజ్‌ అధికారులు ప్రకటించినట్టు పాలవ్యాన్‌లో నకిలీమద్యాన్ని బెల్టుషాపులకు తరలించి విక్రయిస్తున్నట్టు చెప్పారు. దీంతో పేదలు, కార్మిక, కర్షకులు ఈ నకిలీమద్యం సేవించి ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు.

నకిలీమద్యం తయారీ కేంద్రం ఎప్పటినుంచి నడుస్తోందనే దానిపై స్పష్టత లేకపోతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మద్యం దుకాణాల నిర్వహణ మొదలైన తర్వాత నుంచి మొదలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే నకిలీ మద్యం కర్మాగారం నడుస్తున్న భవన యజమాని లక్ష్మీనారాయణ బెంగళూరులో ఉంటారని, ఆయన రామ్మోహన్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడని ఎకై ్సజ్‌ అధికారులు వెల్లడించారు. ఇతను కొన్నినెలల క్రితం దాబా నిర్వహణ నిలిపివేశాడని, తర్వాత ఈ భవనాన్ని ఎవరు లీజుకు పొందారో తెలియాల్సి ఉందని ఎకై ్సజ్‌ అధికారులు ప్రకటించారు. అంటే ఈ దాబా ఖాళీ అయినప్పటినుంచి నకిలీమద్యం తయారీ మొదలై ఉంటుందన్న కోణంలో విచారణ మొదలైంది.

పల్లెపల్లెకు ఈ మద్యమే 1
1/6

పల్లెపల్లెకు ఈ మద్యమే

పల్లెపల్లెకు ఈ మద్యమే 2
2/6

పల్లెపల్లెకు ఈ మద్యమే

పల్లెపల్లెకు ఈ మద్యమే 3
3/6

పల్లెపల్లెకు ఈ మద్యమే

పల్లెపల్లెకు ఈ మద్యమే 4
4/6

పల్లెపల్లెకు ఈ మద్యమే

పల్లెపల్లెకు ఈ మద్యమే 5
5/6

పల్లెపల్లెకు ఈ మద్యమే

పల్లెపల్లెకు ఈ మద్యమే 6
6/6

పల్లెపల్లెకు ఈ మద్యమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement