ముగిసిన దసరా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన దసరా సంబరాలు

Oct 4 2025 1:43 AM | Updated on Oct 4 2025 1:43 AM

ముగిస

ముగిసిన దసరా సంబరాలు

ప్రొద్దుటూరు కల్చరల్‌: దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. విజయదశమిని పురస్కరించుకుని గురువారం విశేష అలంకారాలలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో గురువారం సాయంత్రం శమీదర్శన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విజయానికి, సకలశుభాలకు, సిరిసంపదలకు చిహ్నమైన శమీ వృక్షాన్ని విజయదశమి రోజు దర్శించి పూజలు నిర్వహిస్తే శుభప్రదమని దశమినాడు ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వాసవీమాత అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టువస్త్రాలతో, పూలతో, పుత్తడి ఆభరణాలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చి కొర్రపాడురోడ్డులోని శ్రీ వాసవీ శమీవృక్ష మండపంలో శమీదర్శన మహోత్సవం చేయించారు.

కన్నులపండువగా వాసవాంబ తొట్టిమెరవణి

శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకల సందర్భంగా గురువారం అర్ధరాత్రి విజయలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు గ్రామోత్సవం (తొట్టిమెరవణి) కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని గజమాలలతో, ఆభరణాలతో అలంకరించి శ్రీచక్రం ఉన్న పంచలోహ హంస వాహన రథంపై ఆశీనులను చేసి పురవీధులలో వాసవీ నామస్మరణ మధ్య అట్టహాసంగా ఊరేగించారు. అమ్మవారిశాల నుంచి రాత్రి 11.55 గంటల సమయంలో ప్రారంభమైన తొట్టిమెరవణి బంగారు అంగళ్లవీధి, పప్పుల బజార్‌ మీదుగా 2.50 గంటల సమయంలో పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకుంది. అనంతరం నుంచి శివాలయం ఎదురుగా మార్కెట్‌లో రకరకాల బాణసంచా పేలుళ్లు, చెట్లు, పాములు వంటి వాటిని పేల్చి విజయదశమి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంతార ప్రదర్శన, కేరళ సింగారి మేళం, అమ్మవారి తొట్టిమెరవణిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

● అన్నమయ్య జిల్లాలో దసరా వేడుకలు అంబరాన్నంటాయి. భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. యువతీ,యువకులు జమ్మిచెట్టుకు పూజలు చేసి ,జమ్మి ఆకు పెద్దలకు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు.రాయచోటిలో శ్రీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జరిగిన శమీదర్శన శోభాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె వాసవీభవన్‌వీధిలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరదేవి ధనలక్ష్మి అలంకారంలో అందరినీ ఆకట్టుకుంది. సుమారు రూ.80 లక్షల వరకు కరెన్సీనోట్లతో అమ్మవారి అలంకరించారు.

మదనపల్లెసిటీ: ధనలక్ష్మి అలంకారంలో

వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి

కడపలో గ్రామోత్సవంలో శ్రీ విజయదుర్గమ్మ

రాయచోటిటౌన్‌: శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవి శోభాయాత్ర

ప్రొద్దుటూరు: తొట్టి మెరవణిలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి

ప్రొద్దుటూరు: పుట్టపర్తి సర్కిల్‌లో భక్తుల సందడి

ముగిసిన దసరా సంబరాలు1
1/1

ముగిసిన దసరా సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement