
7న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం ఈనెల 7వ తేది ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలంతా ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని కోరారు.
రాజంపేట: భారతీయ రైల్వే కమిటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి నియమితులయ్యారు. రైల్వేస్టాండిగ్ కమిటీ చైర్మన్‌గా సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈయనతోపాటు కమిటిలో సభ్యులుగా లోక్‌సభ నుంచి 21 మంది లోక్‌సభ సభ్యులను తీసుకున్నారు. అలాగే రాజ్యసభ నుంచి పది మంది సభ్యులను రైల్వే స్టాండింగ్ కమిటిలోకి తీసుకున్నారు. ఇందులో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కూడా ఒకరు కావడం విశేషం. రైల్వేస్టాండింగ్ కమిటి సభ్యునిగా మేడా రఘునాథరెడ్డి ఎంపిక కావడం పట్ల పలువురు వైఎస్సార్‌సీపీనేతలు, అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రైల్వేశాఖ పరంగా ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్‌కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు.
రాయచోటి: డీఎస్సీ–2025లో ఎంపికై న కొత్త ఉపాధ్యాయుల విద్యాబోధన పటిష్టం చేయడం కోసమే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్‌జేడీ శ్యామ్యుల్ అన్నారు. శుక్రవారం రాయచోటిలోని అర్చన కళాశాలలో జరిగిన ఇండక్షన్ రెసిడెన్షియల్ శిక్షణను డీఈఓ సుబ్రమణ్యంతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులు విద్యావృత్తిని సమర్థవంతంగా ప్రారంభించాలన్నారు.డీఈఓ మా ట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఇందుకోసం రాయచోటిలో రెండు, మదనపల్లిలో మూడు సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి భానుమూర్తి రాజు, స్టేట్ నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మొదటిరోజు 273 మంది ఉపాధ్యాయులకు 269 మంది హాజరైనట్లు డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, ఏఎఎంఓ అసదుల్లా, విద్యాశాఖ సిబ్బంది, రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.

7న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం