
గాంధీజీ మార్గంలో నడవాలి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి
రాజంపేట టౌన్: జాతిపిత మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం మాజీ సిఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ గాంధీజీ ఆశయమైన అహింస, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గాంఽధీ చూపిన బాటలో పయనించి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరా జ్యం దిశగా తన హయాంలో బాటలు వేశారన్నారు.మహాత్ముని ఆశయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనిస్‌రెడ్డి, వైఎస్సార్ సిపి వివిధ విభాగాల కన్వీనర్లు వడ్డే రమణ, ఏల్చూరు అశోక్‌కుమార్, సనిశెట్టి నవీన్‌కుమార్, బొగ్గరపు రాజేష్‌గుప్త, పచ్చిపులుసు చక్రి, మిర్యాల సురేఖ, దయానంద్, కటారు శేఖర్‌రెడ్డి, గోవిందు బాలకృష్ణ, దండు గోపి, దాసరి పెంచలయ్య, సురేంద్రయాదవ్, జాహీద్‌అలీ, అబ్దుల్ మునాఫ్, అమర, వేల్పుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.