
గాంధీ జయంతి రోజున జోరుగా మద్యం విక్రయాలు
గుర్రంకొండ : గాంధీ జయంతి అక్టోబర్ రెండో తేదీన మద్యం విక్రయాలు గుర్రంకొండలో జోరుగా జరగడం గమనార్హం. గురువారం నాడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎకై ్సజ్‌శాఖ అధికారులు మండలంలోని మూడు వైన్‌షాపులను సీజ్ చేసి వెళ్లిపోయారు. అయితే వైన్‌షాపు నిర్వాహకులు ముందుగా వేసుకొన్న ప్రణాళికల ప్రకారం మద్యం దుకాణాల పరిసరాలు, వెనుకవైపు బాటిళ్లు ఉంచుకొని యథేచ్చగా విక్రయాలు నిర్వహించారు. పలువురు గాంధీ జయంతి రోజునే బస్టాండులో తాగి రోడ్లపైనే పడిపోయి ఉండడం గమనార్హం. గాంధీ జయంతి రోజున ఇలా మద్యం విక్రయించడం దారుణమని గ్రామస్తులు చర్చించుకొంటున్నారు. ఈ విషయమై వాల్మీకిపురం ఎకై ్సజ్ సీఐ లతను వివరణ కోరగా జరిగిన సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామన్నారు.