నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం

Oct 2 2025 8:20 AM | Updated on Oct 2 2025 8:20 AM

నేడు

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక ఉద్యాన సాగుకు ప్రోత్సాహం 4,5 తేదీల్లో దసరా ప్రత్యేక సర్వీసులు నేడు మహాత్మాగాంధీ ఛాయాచిత్ర ప్రదర్శన

ఒంటిమిట్ట: విజయదశమి సందర్భంగా గురువారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి పార్వేట ఉత్సవం ఉంటుందని టీటీడీ ఆలయ అధికారులు బుధవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలో ఉన్న వావిలి కొలను సుబ్బారావు గుట్టపై ముస్తాబైన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి, ప్రత్యేక పూజలతో పార్వేట ఉత్సవాన్ని ముగిస్తారన్నా రు. అనంతరం ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి తరలివెళ్లి, భక్తులకు అభయమిస్తారని పేర్కొన్నారు.

పుల్లంపేట: స్థానిక సమీకృత బాలుర వసతి గృహం రాష్ట్రస్థాయి స్వచ్ఛ హాస్టల్‌గా ఎంపికై నట్లు వసతిగృహ అధికారులు తిరుపతిరెడ్డి, కిరణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పచ్చనిచెట్లతో ఉంచడంతోపాటు హాస్టల్‌ ఆవరణలో కూరగాయలను సాగుచేసి విద్యార్థుకు స్వచ్ఛమైన తాజా వంటకాలను అందిస్తున్నామన్నారు. జిల్లాలో 54 వసతి గృహాలకుగాను పుల్లంపేట వసతి గృహాన్ని ఉన్నతాధికారులు తనిఖీ చేసి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేశారని వివరించారు.

కడప అగ్రికల్చర్‌: ఉపాధి హామీ, ఉద్యానశాఖ, ఏపీ ఎంఐపీతోపాటు పట్టు పరిశ్రమశాఖల సమన్వయంతో 50 వేల ఎకరాల అదనపు విస్తీర్ణం కింద ఉద్యాన పంటల సాగు ప్రోత్సాహానికి మండల, గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి జి. సతీష్‌ తెలిపారు. గ్రామస్థాయిలో సభలు నిర్వహించి అర్హత ఉన్న ప్రతి రైతును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 100 శాతం రాయితీతో ఎస్సీ, ఎస్టీ రైతులకు, 90 శాతం సబ్సిడీతో చిన్న, సన్న కారు రైతులకు బిందు, తుంపర సేద్య పరికాలు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి తెలిపారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌: దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ముఖ్య ప్రాంతాలకు జిల్లాలోని ఆరు డిపోల నుంచి ఈనెల 4, 5 తేదీలలో సాధారణ ఛార్జీలతో 80 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు 35, హైదరాబాద్‌ 25, విజయవాడ 10, చైన్నెకి 10 బస్సులు వెళతాయని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక, సర్‌ సీవీ రామన్‌ సైన్స్‌ క్లబ్‌ సంయుక్తాధ్వర్యంలో కడప ఐటీఐ సర్కిల్‌ వద్ద గాంధీజీ ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు జేవీవీ జిల్లా అధ్యక్షుడు సమీర్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీజీ జీవిత ఘట్టాలు, జీవిత సందేశం, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో ఆయన పాత్ర, వర్దమాన ప్రపంచానికి గాంధీజీ ఆవశ్యకతపై ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. మద్యం, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, సమాజంలో చైత్యం పెంచాలని కోరుతూ ప్రత్యేక వినతిపత్రం గాంధీజీ విగ్రహానికి సమర్పిస్తారని జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, సైన్స్‌క్లబ్‌ కడప డివిజన్‌ అధ్యక్షులు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం 1
1/2

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం 2
2/2

నేడు ఒంటిమిట్ట రామయ్య పార్వేట ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement