
పింఛన్ల పంపిణీ
రామాపురం: మండలంలోని కల్పనాయన చెరువు గ్రామంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు.
మామిడి మొక్కల పరిశీలన
కల్పనాయన చెరువు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి మొక్కలను కలెక్టర్ పరిఽశీలించారు. ఈ సందర్భంగా పీడీ వెంకటరత్నంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మండలంలోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మినరసయ్యకు పలుసూచనలు చేశారు.
రాయచోటి: ఇన్‌స్పైర్ అవార్డులకు 3048 మంది విద్యార్థులతో వందశాతం నామినేషన్లు సమర్పించి రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం డైట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రితో నామినేషన్ల కార్యక్రమం ముగిసిందన్నారు. జిల్లాలో 625 ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. పాఠశాలలు తమ విద్యార్థులతో ఇన్‌స్పైర్ అవార్డులకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు సమర్పించాయన్నారు. నామినేషన్లు సమర్పించిన వారిలో 12శాతం మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం అవార్డులను ప్రధానం చేస్తుందన్నారు. అవార్డుకు ఎంపికై న ఒక్కో విద్యార్థి అకౌంట్‌లో ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి పదివేల రూపాయలు నగదు జమ చేస్తారన్నారు. అంకితభావంతో పనిచేసిన జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ