
ఫెయిల్యూర్ రహిత డిపోలుగా తీర్చిదిద్దాలి
మదనపల్లె సిటీ : జిల్లాలోని ఆర్టీసీ డిపోలను ఫెయిల్యూర్ రహిత డిపోలుగా తీర్చిదిద్దాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్‌రెడ్డి అన్నారు. బుధవారం మదనపల్లె ఆర్టీసీ–1,2 డిపోలను సందర్శించారు. బస్‌స్టేషన్‌ను పరిశీలించారు. డిపో గ్యారేజీలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 50 డిపోలు ఫెయిల్యూర్‌రహిత డిపోలుగా నమోదైనట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా ఫెయిల్యూర్ రహిత జిల్లాగా సాధించారన్నారు. మదనపల్లె వన్,టు డిపోలు ఫెయిల్యూర్ రహిత డిపోలుగా నమోదు కావాలని కోరారు. సీ్త్రశక్తి పథకం సజావుగా నిర్వహించాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్టాండు ఆవరణంలోని ఫ్లాట్‌ఫారం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిపో ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎంలు మూరే వెంకటరమణారెడ్డి, అమరనాథ్, సీసీఎస్ డెలిగేట్ వినోద్‌బాబు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.