
జీఎస్టీ రేటు తగ్గుదలతో రైతులకు మేలు
కడప అగ్రికల్చర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రేటు తగ్గించడంతో రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందని, వ్యవసాయోత్పత్తులపై పన్నుభారం తగ్గడం వలన కొనుకొనుగోలు శక్తి పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. జిల్లా రైతుల కోసం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్– జీఎస్టీ –2.0 పై బుధవారం కడప ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై రైతులకు అవగాహన సదుస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా వ్యవసాయ అధికారితోపాటు జీఎస్టీ సంయుక్త కమిషనర్ సుమతి, ఉద్యానశాఖ అధికారి సతీ్‌ష్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరెడ్డి, సెరికల్చర్ జిల్లా అధికారి రామశివదీక్షిత్(ఎఫ్‌ఏసీ), ప్రకృతి వ్యవసాయ డీపీఎం ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంయుక్త కమిషనర్ సుమతి మాట్లాడుతూ ట్రాక్టరు, హార్వెస్టింగ్ వంటి వ్యవసాయ యంత్రాలపై పన్ను 18 నుంచి 5 శాతం, ఎరువులు, పురుగు మందులు, బయో పెస్టిసైన్సుపై పన్ను 12 నుంచి 5 శాతం తగ్గిందన్నారు. అలాగే నీటి పారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు ఇతర నీటి పారుదల పంపులపై 12 నుంచి 5 శాతానికి తగ్గింపు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఏడీఏ లక్ష్మిమాధవి, కడప ఏఓ సురేష్‌కుమార్‌రెడ్డి, ఏఈఓలు సరిత, రాధిక, కవితతోపాటు రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి చంద్రా నాయక్