
ఎంపీ బెయిల్‌పై కువైట్‌లో సంబరాలు
రాయచోటి : రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో కువైట్‌లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కువైట్ మాలియా ప్రాంతంలో పార్టీ ఆఫీసు వద్ద గల్ఫ్ కో కన్వీనర్ ఆధ్వర్యంలో మిథున్‌రెడ్డి విడుదల సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టినట్లు గల్ఫ్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కోకన్వీనర్ గోవిందు నాగరాజు తెలిపారు. వారు మాట్లాడుతూ మూడు సార్లు ఎంపీగా గెలిచిన మిథున్‌రెడ్డిని కేవలం రాజకీయ కక్షతో అక్రమ కేసులో జైలుకు పంపించడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం ఇంతటి నీచమైన చర్యలకు పాల్పడిందన్నారు. గల్ఫ్ అడ్వైజర్ నాయిని మహేష్‌రెడ్డి, కువైట్ కోకన్వీనర్ మన్నూరు చంద్రశేఖర్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు షేక్ రహమతుల్లా, సీనియర్ నాయకులు పూలపుత్తూరు సురేష్‌కుమార్‌రెడ్డి, కమిటీ సభ్యులు అఫ్సర్‌ఆలీ, అబ్బాస్, కిషోర్, హనుమంతురెడ్డి, షంషుద్దీన్, షేక్ ముస్తఫా, షఫీ తదితరులు పాల్గొన్నారు.