
మంత్రి మండిపల్లిని కలిసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి
రాయచోటి టౌన్ : రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆయనను కలసి జిల్లాలోని శాంతి భద్రతలు, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మైనర్ల డ్రైవింగ్ నియంత్రణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే యువత క్రీడలపై మక్కువ పెంచుకొనేందుకు పోలీస్ శాఖ సహాయ సహకారాలు అందించాలని మంత్రి కోరారు. దీనిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు.