
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
● ముగిసిన కళా ఉత్సవ్–2025 పోటీలు
జ్ఞాపికలను అందుకున్న విజేతలతో డీఈఓ సుబ్రమణ్యం
కళా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థినులు
రాయచోటి : పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు జిల్లాస్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలలో తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు సత్తాచాటి శభాష్ అనిపించుకున్నారు. రాయచోటిలోని జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాస్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలు రెండురోజులపాటు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగి శుక్రవారం ముగిశాయి. ఆరు కళారూపాలలో పన్నెండు అంశాలకు సంబంధించి వ్యక్తిగత, బృందాలకు నిర్వహించిన ఈ పోటీలలో 37 పాఠశాలలకు సంబంధించి 110 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం విద్యార్థుల ప్రదర్శనలపట్ల అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు వీరే...
గాత్ర సంగీతం వ్యక్తిగత విభాగంలో నజియా తబస్సు (పభుత్వ బ్‌లైండ్ పాఠశాల, కడప) బృందం విభాగంలో హాసిని, హర్షిత, హిమబిందు (ఎంజేపీఏపీబీసిడబ్ల్యుఆర్ స్కూల్, నందలూరు), వాద్య సంగీతం వ్యక్తిగత విభాగంలో ఎస్ మహమ్మద్ సల్మాన్ (ప్రభుత్వ బ్‌లైండ్ పాఠశాల కడప), బృందం విభాగంలో జీవన్ కుమార్, సందీప్ రెడ్డి, భావన కుమార్, హరిప్రసాద్ (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి), నృత్యం వ్యక్తిగత విభాగంలో ఎస్ హాసిని (ఎంజీపీఏపీబీసిడబ్ల్యుఆర్ స్కూల్, నందలూరు), బృందం విభాగంలో గౌతమి, గంధర్విక, నాగ నిషిత, నందిని (జిల్లా పరిషత్ హైస్కూల్ కె రామాపురం, రాయచోటి మండలం), నాటకం విభాగంలో భాను ప్రసాద్, భాను ప్రకాష్, రామ్ గణేష్ రెడ్డి, పృద్విరాజు (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి) దృశ్యకళల వ్యక్తిగత విభాగం, చిత్రలేఖనంలో ఎస్ మహమ్మద్ జయిద్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డైట్, రాయచోటి) శిల్పకళలో యశ్వంత్ రెడ్డి (ఏపీ మోడల్ స్కూల్, సంబేపల్లి), బొమ్మల తయారీలో వీర అశ్విని (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి), సాంప్రదాయ కథ చెప్పడం (బుర్రకథ) నందు సమీరా, పూజా(ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి)లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీలలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలకు డిఈఓ జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా కేంద్ర, సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్, నాట్యకళాకారుడు స్వతంత్ర బాఉ, సంగీత ఉపాధ్యాయాఉలు నాగబూషణంలు వ్యవహరించారు. జిల్లాస్థాయి విజేతలుగా ఎంపికై న వారు అక్టోబర్ 24, 25వ తేదిలలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే కళా ఉత్సవ్ పోటీలలో పాల్గొంటారని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, డిసిఈబీ సెక్రటరీ నాగమునిరెడ్డి, డైట్ అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులు, జిల్లాలో వివిధపాఠశాలల నుండి వచ్చిన గైడ్ టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా