
హైవేపై తప్పిన ప్రమాదం
సిద్దవటం : బియ్యం రవాణా చేస్తున్న ఐచర్ హనం అతి వేగంగా వస్తూ మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై చర్చి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఒంటిమిట్ట సీఐ బాబు తెలిపారు. రహదారికి అడ్డంగా ఉన్న వాహనాన్ని తొలగిస్తున్నామని, క్రాసింగ్‌లో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
భూమి కోసం ఘర్షణ
కలకడ : భూమి కోసం జరిగిన ఘర్షణలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్–ప్రసాద్‌రెడ్డిలకు భూవివాదం ఉంది. బుధవారం ఈ విషయమై మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. దీంతో ప్రవీణ్‌కుమార్‌పై కొడవలితో ప్రసాద్‌రెడ్డి, సునీతలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వాల్మీకీపురం ప్రభుత్వం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైధ్యం కోసం మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

హైవేపై తప్పిన ప్రమాదం