
రోగులపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు
సిద్దవటం: రోగుల పట్ల వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని కడప డీఎంహెచ్‌ఓ నాగరాజు హెచ్చరించారు. మండలంలోని పి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఐడీ కార్డు, డ్రస్ కోడ్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కాన్పుల వార్డు, పేషెంట్ల గదులు, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గదులను తనిఖీ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే 104 వాహనం వద్దకు వచ్చే రోగులకు రక్తనమూనాలు సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రంగ లక్ష్మీ, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.