
ఫుట్‌బాల్ బాలికల విజేత వైఎస్సార్ జిల్లా
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర అన్నారు. మండలంలోని పోతోబోలు వేదా పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పుట్‌బాల్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతుల ప్రదానం జరిగింది. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో ఫైనల్స్‌లో విన్నర్స్‌గా వైఎస్సార్ కడప జిల్లా నిలిచింది. రన్నర్స్‌గా అనంతపురం, తృతీయ స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందించిన అనంతరం డీఎస్పీ మాటాల్డుతూ విద్యార్థి స్థాయి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఎంచుకున్న క్డ్రీడలో ప్రతిభ కనబరిస్తే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని రెండింటినీ సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దిలీప్‌కుమార్, కార్యదర్శి మురళీధర్, కోచ్‌లు హరి, పవన్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సురేష్, ఉమాదేవి, కమలేష్, అంజనప్ప, బాలాజీ పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ బాలికల విజేత వైఎస్సార్ జిల్లా