
పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించిన ఎస్పీ
కడప అర్బన్ : కడప శివారులోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(స్‌సీటీపీసీ)కు శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలోడీటీసీ పరిసర ప్రాంతాలు, మౌలిక వసతులు, బ్యారక్‌లు, కిచెన్, జిమ్, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్‌ను చూసి త్వరితగతిన శిక్షణకు పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్, ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే మైదానం, క్లాస్ రూమ్స్, రన్నింగ్ ట్రాక్, పరేడ్ గ్రౌండ్స్, డ్రిల్ ఏరియా, బాటిల్ అబ్స్టాకల్స్‌ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. శిక్షణ కేంద్రంలో వసతి సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌కరీం, డీటీసీ ఇన్‌స్పెక్టర్ ఎస్.వినయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.