
అంగరంగ వైభవంగా రామయ్య పట్టాభిషేకం
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం పట్టణంలోని శ్రీ పట్టాభిరామాయంలో టీటీడీ ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చన, అభిషేకం, తోమాల సేవ అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ ఘట్టాన్ని భక్తుల నడుమ ఘనంగా చేపట్టారు. సాయంత్రం ఆలయంలో ఊంజలసేవ మండపంలో ఊంజల సేవ జరిగింది. రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు గరుడ వాహనంపై తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమాలలో ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు క్రిష్ణబట్టార్, భాషికాచార్యులు తదితరులు పాల్గొన్నారు. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన శ్రీసీతారాములను దర్శించుకున్నారు. చింతల ఆనందరెడ్డి, బిడ్డల కేశవరెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా రామయ్య పట్టాభిషేకం