
ఉపాఽధిలో ‘తమ్ముళ్ల’ దోపిడీ!
సాక్షి టాస్క్‌పోర్స్: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూలీలకు అందకుండా తెలుగు తమ్ముళ్లు దోపిడీకి పూనుకుంటున్న సంఘటనలు రాయచోటి ప్రాంతంలో వెలుగు చూస్తున్నాయి. కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతంలో అరకొరగా జరుగుతున్న ఉపాధి పనులు చేసుకుని పూట గడుపుకుందామనుకుంటున్న కూలీలకు నిరాశే ఎదురవుతోంది. ఫారమ్‌పాండ్స్, ఫిష్ ఫాండ్స్ పనులను అధికారులపై ఒత్తిడి తెచ్చి తెలుగు తమ్ముళ్లు ఆయా పనులను జేసీబీ యంత్రాలతో కానిచ్చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే రాయచోటి మండలం మాధవరం గ్రామంలోని కొండ ప్రాంతాలలో మంజూరైన ఫారమ్‌పాండ్స్, ఫిష్‌పాండ్స్ పనులను ఉపాధి కూలీలతో కాకుండా , జేసీబీ యంత్రాలతో చేస్తున్న విషయాన్ని స్థానిక కూలీలు పసిగట్టి సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఇటీవల కాలంలో సంబంధిత అధికారులు ఈ విధంగా పనులను కూలీలతో కాకుండా యంత్రాలతో చేయించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని వారికి చెప్పినప్పటికి ఎటువంటి మార్పు రాలేదని అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
రాయచోటి మండలానికి
260 ఫారమ్ పాండ్స్ మంజూరు :
రాయచోటి మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు , తద్వారా రైతుల పొలాలలో నీటి నిల్వ చేయడం వల్ల భవిష్యత్ లో భూగర్భ జలాలు పెంపొందించే ఉద్దేశ్యంతో సుమారు 260 ఫారమ్ ఫాండ్స్ మంజూరైనట్లు రాయచోటి ఉపాధి ఏపీవో రమేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 220 వరకు పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఫారమ్ పాండ్స్ తోపాటు , ఫిష్ పాండ్స్ , ఇతర ఉపాఽధి హామీ పథకంలోని పనులన్నీ కూలీలతోనే చేయించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు తెలుగు తమ్ముళ్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ,కూలీలతో చేయించాల్సిన పనులను కూడా జేసీబీ యంత్రాలతో చేయిస్తుండటం గమనార్హం . ఈ విధంగా జేసీబీ యంత్రాలతో ఉపాధి పనులు చేయించడం వల్ల ఒక్కో ఫారమ్ పాండ్ కు కొలతల ఆధారంగా రూ.60 నుంచి రూ.70వేల వరకు చెల్లిస్తున్నారు. ఈ విధంగా సగానికి పైగానే యంత్రాలతో పనులు చే యిస్తూ కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఉపాధి కూలీల సొమ్మును కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీఓ రమేష్ వివరణ: జేసీబీ యంత్రాలతో ఉపాధి పనులు చేస్తున్న విషయంపై రాయచోటి మండల ఉపాధి ఏపీఓ రమేష్‌ను వివరణ కోరగా.. గతంలో కూలీలు పనులు చేసిన చోటనే యంత్రాలతో పనులు చేస్తున్న విషయం తమ దృష్టికి రాగా వెంటనే ఆపేయాలని, అటువంటివి చేయకూడదని చెప్పామని తెలిపారు. ఉపాధి పనులన్నీ కూడా కూలీలతోనే చేయించే విధంగా చర్చలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జేసీబీ , ఇతర యంత్రాలతో పనులను ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదని ఫీల్డ్‌స్థాయి అధికారులకు కూడా తెలిపామన్నారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
జేసీబీ యంత్రాలతో పనులు
కూలీలకు దూరంగా ఫారమ్ పాండ్స్, ఫిష్ పాండ్స్ పనులు
అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు

ఉపాఽధిలో ‘తమ్ముళ్ల’ దోపిడీ!

ఉపాఽధిలో ‘తమ్ముళ్ల’ దోపిడీ!