
ఏపీఎండీసీ బడిలో సిఫార్సు ఉంటేనే సీటు
ఓబులవారిపల్లె : ఏపీఎండీసీలో పనిచేసే ఉద్యోగులు, గనుల విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలు, చుట్టు పక్కల పేద పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏపీఎండీసీ సీఎస్‌ఆర్ నిధులతో కోట్లు ఖర్చు చేసి ఏపీఎండీసీ పాఠశాలను నిర్మించి నిర్వహిస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీఎండీసీలో ఽరాజకీయ నాయకులు జోక్యం చేసుకుని సిఫార్సుతో ధనికులు, స్థానికేతరుల పిల్లలకే సీట్లు కేటాయిస్తున్నారు. సీటు రాకపోవడంతో నిర్వాసిత కుటుంబాల వారు, ఉద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఏపీఎండీసీ పాఠశాలకు భలే గిరాకీ..
తమ పిల్లలను ఏపీఎండీసీ పాఠశాలలోనే చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటంతో పాఠశాలకు గిరాకీ పెరిగింది. 2018వ సంవత్సరంలో ఏపీఎండీసీ పాఠశాల ప్రారంభించారు. 30 గదులతో దాదాపు 450 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది.
ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చొరవతో మధ్యాహ్న భోజనం
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చొరవతో ఏపీఎండీసీ పాఠశాల విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. పాఠశాలలో చదివే 1050 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఉండటంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి కనబరిచేవారు.
సీటు కావాలంటే సిఫార్సు తప్పనిసరి..
పాఠశాలలో చేరాలంటే ఏపీఎండీసీ యాజమాన్యానికి ఎమ్మెల్యే, ఎంపీ ఆపై స్థాయి రాజకీయ నాయకుల సిఫార్సులు తప్పని సరి అయిపోయింది. విద్యార్థి స్థానికుడైనా, ఏపీఎండీసీ ఉద్యోగి సంతానమైనా, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారైనా ప్రస్తుతం సిఫార్సు లేఖలు తప్పనిసరి అని యాజమాన్యం, అధికారులు తెగేసి చెబుతున్నారు. అర్హత ప్రామాణికంగా పిల్లలకు సీటు కేటాయించాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడులకు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి.
నూతన భవనాలు ఏర్పాటు చేయాలి
ఏపీఎండీసీ పాఠశాల ప్రారంభంలో 30 తరగతి గదులతో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. అయితే ప్రస్తుతం 1050 మంది విద్యార్థులు ఉన్నా అవే తరగతి గదులు ఉన్నాయి. అదనపు తరగతి గదులు కట్టించాలని గతంలో ప్రతిపాదనలు చేసినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికై నా ఏపీఎండీసీ యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధులతో నూతన తరగతి గదులను ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
నిర్వాహకుల చేతివాటం..
సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వకుండా నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. తరగతిని బట్టి ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు పుస్తకాలను అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.
నీరుగారిపోతున్న సీఎస్‌ఆర్ పాలసీ లక్ష్యం
యాజమాన్యం తీరుపై ఉద్యోగులు,
స్థానికుల ఆగ్రహం