
ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం
రాయచోటి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలకు తెలియపరిచే బాధ్యతను ప్రతి ఒక్కరం తీసుకుందామని వైఎస్‌ఆర్‌సీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు, ఆత్మీయులకు పిలుపునిచ్చారు. మంగళవారం రాయచోటిలోని సుగవాసి స్వగృహంలో గుంటిమడుగు, కాటిమాయకుంట గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటల కారణంగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ పాలనను కాదని కూటమి పార్టీలకు ప్రజలు ఓట్లు వేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని వదిలి, కూటమి నేతల ధన, సంపద, సంక్షేమంతో ముందుకు సాగుతోందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదింపి రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ పాలన తేవడానికి కృషి చేయాలన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. త్వరలోనే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గ్రామాలలో పర్యటించి కూటమి పాలన అవినీతి, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అందిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిద్దామన్నారు. అనంతరం రెండు గ్రామాల పరిధిలోని ప్రజల పరిస్థితులు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ఆ గ్రామాల నాయకులు గజమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి రూరల్ మండల పరిధిలోని గుంటిమడుగు, కాటిమాయకుంట గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఖాదర్‌వల్లి, కర్నపు రమణారెడ్డి, కొక్కంటి రెడ్డప్పరెడ్డి, శేఖర్‌రెడ్డి, దేవనాథరెడ్డి, అమరనాథరెడ్డి, నల్లగుండ్లపల్లి మహేష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బొంకు బాబురెడ్డి, రాఘవరెడ్డి, నడిపి రెడ్డయ్య, ఖాదర్‌బాషా, వడిపల్లి రాజా, షేక్ అబ్బాస్, షేక్ ఆదిల్, ఇలాహి, మహమ్మద్, దేవర నాగేంద్ర, ఫజిల్, షేక్ అజ్గర్, షేక్ బాబ్జీ, పంగ రఘురామ, సాయి, తిరుమల, రామయ్య, వెంకటరమణ, గుంటిమడుగు మాజీ డీలర్ రమణ, పెద్దివీటి ఆంజనేయులు, మహేష్, మనోహర్, నాగేశ్వర, అంజి, రమణ, రామాంజనేయులు, బాబు తదితరులు పాల్గొన్నారు.
అభిమానులు, ఆత్మీయులతో వైఎస్‌ఆర్‌సీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం