
రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు
కలికిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిలో వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపంలో గల టోల్‌గేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ సొంత పనుల నిమిత్తం మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గండబోయనపల్లి సమీపంలోని టోల్‌గేటు వద్ద కర్ణాటకకు చెందిన కెఎ36ఎం 9619 తూఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో వినేష్‌కు తీవ్ర గాయాలు కాగా, తూఫాన్ వాహనం రోడ్డుపైన ఫల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. వినేష్‌ను స్థానికులు కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు.
చౌకదుకాణం మూత.. తప్పని వెత
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ రైల్వేగేట్ సమీపంలోని చౌకదుకాణం మంగళవారం మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ మొదటి రోజే చౌకదుకాణానికి బీగాలు వేయడంతో రేషన్ దుకాణానికి వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. చౌకదుకాణం మూసివేయడంపై ఆర్‌ఐ సుశీల్‌కుమార్‌ను వివరణ కోరగా రేషన్ డీలర్ బంధువులు చనిపోవడంతో కడపకు వెళ్తున్నామని తహసీల్దార్ అమరేశ్వరి వద్ద పర్మిషన్ తీసుకుని డీలర్ వెళ్లారని ఆర్‌ఐ తెలిపారు.
ఆటో బోల్తా
మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. సోమల మండలం నంజంపేటకు చెందిన విజయ్(42), చోటేసాబ్(62), నంజంపేట వడ్డిపల్లెకు చెందిన రమణ(49) ముగ్గురూ కలిసి మదనపల్లె మండలం వలసపల్లె వద్ద కట్టెలు కొట్టేందుకు కూలిపనులకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలోని పెద్దూరు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చౌడేపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు