
దేవతా మూర్తులకు పవిత్రాల అలంకారం
కడప కల్చరల్ : కడప రాయుడు శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల–తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా మూడవరోజు గురువారం విశేష పూజోత్సవాలు నిర్వహించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్, తివిక్రవ్ బృందం పూజ కార్యక్రమాలు నిర్వహించాయి. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఉదయం అలంకార మూర్తులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పవిత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి ఊరేగిపుగా పవిత్రాలను తెచ్చి పూజల కోసం వేద పండితులకు అందజేశారు. కలశాలను వేదికపై కొలువుదీర్చిన స్వామి ఉత్సవ మూర్తి వద్ద పవిత్రాల ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రిమ్స్ మార్చురీలో
వృద్ధురాలి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివారులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీలో గుర్తు తెలియని వృద్ధురాలు సావిత్రమ్మ (65) మృతదేహం వుంది. ఈమెను అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం వత్తలూరు నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ నెల 24న కడప రిమ్స్‌లో చేర్పించినట్లు రికార్డుల్లో ఉంది. గురువారం ఉదయం 8:39 గంటలకు మృతి చెందింది. ఈమె కోసం ఎవరూ రాలేదు. ఈమె ఆచూకీ తెలిసిన వారు తమను నేరుగా సంప్రదించాలని రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.

గుర్తుతెలియని వృద్ధురాలు