
మదనపల్లె : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మదనపల్లె పట్టణంలో జరిగింది. పట్టణంలోని వారపుసంత వద్ద మీసేవ సెంటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టుటౌన్ పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అయితే మృతుడు స్థానికుడు కాదని, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని చెప్పడంతో, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 50–60 మధ్య వయసు ఉంటుందని, అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. నిలువుగీతల నీలిరంగు షర్టు, ముదురు నేవీ బ్లూ కలర్ గీతల ప్యాంటు ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతుని వివరాలు కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.