
ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
● జిల్లాలో 7990 మంది వాహన దారులకు ప్రయోజనం
● ఐదో విడతలో అధిక మందికి ఆర్థిక సాయం
● నేడు బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి రాయచోటి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ప్రభుత్వం వాహన దారులకు అండగా నిలిచింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపుతూ వాహనాలను నడుపుకొనేందుకు చేయూత అందిస్తోంది. వెనుకబడిన ఆటో, క్యాబ్ యజమానులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక భరోసా కల్పిస్తూ నేడు బటన్‌నొక్కి ఐదో విడతగా వారి ఖాతాలకు ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఎంతో కొంత వారి వాహన నిర్వహణకు సరిపోతుందన్న ఆలోచనతో ఈ సాయం అందిస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక రవాణా శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. వరుసగా ఐదో ఏడాది అర్హులైన ఒక్కొక్క ట్యాక్సీ, క్యాబ్, ఆటో వాలాలకు ఐదో విడతగా ఈ ఏడాది రూ.10,000 చొప్పున అందిస్తున్నారు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా.. అర్హులందరికీ అందించాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 7990 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.7.99 కోట్లు జమ చేయనున్నారు.
● వాహనాలకు సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో జిల్లాలోని అనేక మంది చిన్నపాటి వాహన యజమానులకు ఎంతో ప్రయోజనం కలిగింది. ట్యాక్సీ, క్యాబ్ వాహన దారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఎంతో కొంత వాహన నిర్వహణ ఖర్చులకు సరిపోతుందన్న ఆలోచనతో ప్రతి యేడాది ఆర్థికసాయం అందిస్తోంది.
● శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జరిగే బహిరంగసభలో బటన్ నొక్కి ప్రారంభించగానే అధికారులు ఆ మొత్తాలను ఖాతాలకు జమచేయనున్నారు. వాహనదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఇప్పటికే అర్హత కలిగిన వారు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో వైఎస్‌ఆర్ వాహన మిత్ర
లబ్ధిదారుల వివరాలు
సంవత్సరం లబ్ధిదారులు మొత్తం
(రూ.కోట్లలో)
అర్హులందరికీ వాహన మిత్ర
జిల్లాలో అర్హులైన ఆటో రిక్షా, ట్యాక్సీ క్యాబ్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారికి వాహన మిత్ర పథకాన్ని అందిస్తున్నాం. మొన్నటివరకు అర్హుల దరఖాస్తులు స్వీకరించాం. ఒక్కొక్కరికి రూ. 10 వేలు అందించనున్నాం. రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ గిరీషాతోపాటు ప్రజాప్రతినిధులు అందజేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు హాజరు కానున్నారు.
– పి.దినేష్ చంద్ర, జిల్లా రవాణా శాఖ
అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా
2019–20 4946 4.94
2020–21 7350 7.35
2021–22 7338 7.33
2022–23 7563 7.56
2023–24 7990 7.99

