
హర్షవర్ధన్ (112 పరుగులు)
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఏసీఏ అండర్–23 అంతర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో సెంట్రల్‌జోన్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచ్‌ను బుధవారం నిర్వహించగా, మ్యాచ్‌లో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సెంట్రల్‌జోన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. జట్టులోని రోహిత్ 91 పరుగులు, కార్తికేయ 74 పరుగులు చేశారు. నార్త్‌జోన్ బౌలర్ వంశీనారాయణ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్త్‌జోన్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులోని హర్షవర్ధన్ 112 పరుగులు, రాహుల్ 77 పరుగులు చేశారు. దీంతో సెంట్రల్‌జోన్ జట్టు 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రోహిత్ (91 పరుగులు)