రామోజీ .. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

YSRCP Senior Leader Jupudi Prabhakar Takes On Ramoji And Chandrababu - Sakshi

తాడేపల్లి:  ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను ప్రభుత్వం పొడిగించడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత జూపూడి ప్రభాకర్‌  స్పష్టం చేశారు. అదే సమయంలో సబ్‌ ప్లాన్‌పై ఈనాడు బొజ్జ రాక్షసుడు అసత్యాలు రాస్తున్నాడని రామోజీరావును ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు జూపూడి.

సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదని, చంద్రబాబు హయాంలో దళితులకు ఏం చేశారో రామోజీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాబు హయాంలో సబ్‌ ప్లాన్‌ నిధులను కూడా ఖర్చు చేయలేదుని, చంద్రబాబు అరాచకాలను రామోజీ ఎందుకు ప్రశ్నించలేదని జూపూడి నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రామోజీ చర్చకు సిద్ధమా అని జూపూడి చాలెంజ్‌ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి తొలిస్థానం దక్కిందనే విషయం గ్రహాంచాలని యెల్లో మీడియాకు చురకలంటించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top