ఢిల్లీ: 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి వైఎస్సార్‌సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. యూఎన్ సమావేశాల కోసం ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో మిథున్‌రెడ్డి పాల్గొనున్నారు. ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి మిథున్‌రెడ్డి నివాళులర్పించారు. మిథున్‌రెడ్డితో పాటు ఎంపీల బృందం సమావేశాల్లో పాల్గొననుంది.

ఐక్య రాజ్యసమితి సమావేశాల్లో మిథున్‌రెడ్డి.. భారత వాణి బలంగా వినిపించనున్నారు. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత ఎంపీలు రెండు బృందాలుగా హాజరవుతున్నారు. ఒక్కో బృందంలో 15 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలలో ఎంపీల బృందం పాల్గొననుంది.






