ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు | YSRCP Chief YS Jagan Extends Ramadan Wishes to the Muslim Community | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Mar 20 2026 5:28 PM | Updated on Mar 21 2026 7:12 AM

YSRCP Chief YS Jagan Extends Ramadan Wishes to the Muslim Community

తాడేపల్లి :  రేపు రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా..అల్లాహ్‌ స్మరణలో తరించే ఈ రంజాన్‌ పండగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. 

అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement