ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌‌ లేఖ | Ys Jagan Written Letter To Narendra Modi About Visakha Steel Plant | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌‌ లేఖ

Feb 6 2021 9:26 PM | Updated on Feb 6 2021 9:52 PM

Ys Jagan Written Letter To Narendra Modi About Visakha Steel Plant - Sakshi

విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చింది. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారు.నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు.విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని మోదీని లేఖ ద్వారా కోరారు. సీఎం జగన్‌ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా ఉంది.'ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలి.విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చింది. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారు.నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనపరిచింది. ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయి. ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయి. 

స్టీల్‌ప్లాంటుకు సొంతంగా గనులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చు.7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తి చేస్తున్నారు. డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోంది. దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోంది. సెయిల్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయి. వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లొచ్చు.'అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement