
సాక్షి, తాడేపల్లి: విజయ్ దివాస్ సందర్భంగా మన సైనికుల పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘కార్గిల్ యుద్ధంలో మన సైనికులు అత్యుత్తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
మన సైనికుల ధైర్యం, అచంచలమైన దేశభక్తి దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్న వైఎస్ జగన్.. దేశ సేవలో పాల్గొంటున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

The valour and supreme sacrifice of our brave soldiers in the Kargil War will always be remembered. Their courage and unwavering patriotism continue to inspire the nation. Heartfelt gratitude to the armed forces and their families for their dedication and selfless service.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025